కళ్యాణదుర్గం పట్టణంలోని బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. రోగులు తరలివచ్చారు. వైద్యులు భావన, నితీష్, భారతి, రాము, అయేషా లు రోగులను పరీక్షించారు. గుండె, షుగర్, బీపీ, కంటి, పంటి పరీక్షలు నిర్వహించారు. ఉచితంగా మందులు అందజేశారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు వైద్య శిబిరాన్ని నిర్వహించారు.