నందిగామ: మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ నందిగామలో మోకాళ్లపై కూర్చొని కార్మికులు నిరసన
Nandigama, NTR | Jul 5, 2025 మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కార్మికులతో కలిసి శనివారం ఉదయం 11 గంటల నుండి సిఐటియు ఆధ్వర్యంలో నందిగామ మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. కార్మికుల సమస్యల పరిష్కరించాలంటూ కార్మికులు మోకాళ్లపై నిలుచుని నిరసన వ్యక్తం చేశారు సిఐటియు ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి కే గోపాల్ ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించారు.