దర్శి: జులై 9వ తేదీ సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు నాయకులు రమేష్ పిలుపు
ప్రకాశం జిల్లా దొనకొండ మండలం కురిచేడు గ్రామంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు నాయకులు రమేష్ పిచ్చయ్య రూబెన్ పిలుపునిచ్చారు. ఉద్యోగ కార్మిక ప్రజా సమస్యల పరిష్కారం కోసం జులై 9వ తేదీన దేశవ్యాప్తంగా కార్మికులు చేపట్టిన సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. సిఐటియు ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో కార్మికుల ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజేస్తూ జిల్లా జీప్ జాతర చేపట్టడం జరిగిందన్నారు. పని గంటలు తగ్గించడంతోపాటు కనీస వేతనం 26 వేల రూపాయలు చెల్లించాలని, కార్మిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.