దుబ్బాక: దుబ్బాక పట్టణంలో ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి
సిద్దిపేట జిల్లా దుబ్బాక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఐకెపి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. వర్షం వచ్చినప్పుడు ధాన్యం తడవకుండా రైతులందరికీ కవర్లు ఇవ్వాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో వెంకట్ రెడ్డి, ఆర్ఐ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.