చౌటుప్పల్: విద్యార్థులు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి:చౌటుప్పల్ పోలీస్ ఇన్స్పెక్టర్ మన్మధ కుమార్
యాదాద్రి భువనగిరి జిల్లా: సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని చౌటుప్పల్ పోలీస్ ఇన్స్పెక్టర్ మన్మధకుమార్ సోమవారం అన్నారు. చౌటుప్పల్ లోని గాందిరి పార్కు సమీపంలో ఉన్న ప్రతిభ ఒకేషనల్ శ్రీ మేధా జూనియర్ కళాశాలలో సోమవారం విద్యార్థులకు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు .సమాజంలో పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సైబర్ మోసాలకు గురికాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చుట్టూ సమాజాన్ని విద్యార్థులు జాగృతం చేయాలన్నారు.