శ్రీశైలం ఘాట్ రోడ్ లో ఆటో కారు డి . ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు.
శ్రీశైలం ఘాట్ రోడ్డులోని శిఖరేశ్వరం సమీపంలో శుక్రవారం మద్యాహ్నం కారు, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న గుంటూరుకు చెందిన నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు 108 వాహనానికి సమాచారం అందించారు.సమాచారం అందుకున్న వెంటనే 108 వాహనం నుంచి బాధితులను సున్నిపెంట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.