తాడేపల్లిగూడెం: అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా ఐదవ రోజు పట్టణంలోని APSSSR పాఠశాలలో విద్యార్థులకు అగ్ని ప్రమాదాలపై అవగాహన.
అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా అయిదవ రోజు ప.గో.జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో గురువారం సాయంత్రం 4 గంటలకు తాడేపల్లిగూడెం అగ్నిమాపక అధికారి జీవీ రామారావు ఆధ్వర్యంలో పట్టణంలోని APSSSR పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించారు. అగ్నిప్రమాదలు సంభవించినప్పుడు తీసుకోవలసిన చర్యలు, అగ్నిప్రమాదలు సంభవించకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి విద్యార్థులకు తెలియచేశారు. ప్రమాదవశాత్తు ఫైర్ అయినపుడు ఫైర్ ఎక్స్టింగ్విషర్ లను వినియోగించాలి అనే దానిపై డెమో నిర్వహించారు. ఈ డెమోలో ఫైర్ సిబ్బందితోపాటు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.