పెద్దపల్లి: మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ గీట్ల ముకుందర్ రెడ్డి విగ్రహం వద్ద నివాళులు అర్పించిన ఎమ్మెల్యే విజయరమణ రావు
పెద్దపల్లి మాజీ శాసనసభ్యులు కి.శే. గీట్ల ముకుందర్ రెడ్డి వర్ధంతి సందర్బంగా పెద్దపల్లి పట్టణంలోని కూనరం కూడలిలో శనివారం ఉదయం వారి విగ్రహానికి పూలమాల వేసి వారి కుటుంబ సభ్యులతో మరియు స్థానిక నాయకులతో కలిసి నివాళులు అర్పించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.