మణుగూరు: చేతి వేళ్ళతో ఒలిచిన గోటి తలంబ్రాలతో ఏడూళ్ల బయ్యారం నుంచి భద్రాచలానికి భక్తుల పాదయాత్ర
భద్రాచలం రామయ్య కళ్యాణానికి చేతి వేళ్ళతో ఒలిచినా గోటి తలంబ్రాల తయారీ కార్యక్రమం పూర్తయిందని కనకదుర్గమ్మ ఆలయ అర్చకుడు అంబటిపూడి ప్రసాద్ శర్మ తెలిపారు. గురువారం మధ్యాహ్నం సమయంలో పినపాక మం.ఏడూళ్ల బయ్యారం గ్రామంలోని కనకదుర్గ ఆలయం, శ్రీ సాయిబాబా ఆలయం నుంచి గోటి తలంబ్రాలతో భద్రాచలం వరకు భక్తుల పాదయాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. గత పదేళ్లుగా గోటి తలంబ్రాలతో భద్రాద్రి రామయ్య చెంతకు వెళుతున్నట్లుగా పూజారి
తెలిపారు.