ఆలూరు: ఆదోని జిల్లా ఏర్పాటు కోసం హొళగుందలో విద్యార్థుల ర్యాలీ
Alur, Kurnool | Dec 3, 2025 ఆలూరు నియోజకవర్గం లోని హోలగుందా మండలంలోని విద్యార్థుల ర్యాలీ. ఆదోని జిల్లా చేయాలని విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆదోని జిల్లా అయితేనే వెనుకబడిన ప్రాంతమైనటువంటి ఆలూరు అభివృద్ధి చెందుతుందన్నారు. ఉపాధి కలుగుతుందన్నారు. వలసలు ఆగుతాయని, సాగు తాగు నీరు రైతులకు అందించాలన్నారు. ఆదోని జిల్లా సాధన కోసం నియోజకవర్గాలు అన్ని ఏకమవుతున్నాయి. విద్యార్థులు పాఠశాల నుండి ఊరి బస్టాండ్ చివరిదాకా ర్యాలీ నిర్వహించారు.