గుంతకల్లు శివారులో కొనకొండ్ల రోడ్డులో మారెమ్మ గుడి సమీపంలో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో నంద్యాల జిల్లా ప్యాపిలికి చెందిన వడ్డే సుబ్రహ్మణ్యం (41) మృతి చెందాడు. మరో నలుగురు గాయపడ్డారు. వజ్రకరూరు నుంచి గుంతకల్లుకు ప్రయాణికులతో వెళుతున్న ఆటో అదుపు తప్పి బోల్తాపడడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.