అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం లోని సింగనమల మండలం శివపురం వద్ద జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ద్విచక్ర వాహనం డివైడర్ను ఢీకొన్న ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో తాడిపత్రి పట్టణానికి చెందిన ఆదినారాయణ నాగరత్నమ్మ అనే దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని నేషనల్ హైవే అథారిటీ వారి అంబులెన్స్ ద్వారా అనంతపురం ఆసుపత్రికి తరలించారు. వారిలో ఆదినారాయణ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.