హుస్నాబాద్: హుస్నాబాద్ నియోజకవర్గంలోని చిన్న ముల్కనూర్ లోపంచాయతీ ఎదుట త్రాగునీటి కోసం మహిళలు ఖాళీ బిందెలతో ఆందోళన #locallissue
హుస్నాబాద్ నియోజకవర్గం లోని చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూర్ గ్రామ పంచాయతీ ఎదుట త్రాగునీటి కోసం మహిళలు ఖాళీ బిందెలతో ఆందోళన చేపట్టారు. పండగ పూట కూడా త్రాగు నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని రోజులు నుండి గ్రామపంచాయతీ నల్ల నీళ్లు రావడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండ్లలో వాడుకోవడానికి బొట్టు నీళ్లు కూడా లేవని వాపోయారు. నీళ్ల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.