పత్తికొండ: వెల్దుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్స్రే యంత్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కె శ్యాంబాబు
వెల్దుర్తి ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎక్స్రే యంత్రాన్ని పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాం బాబు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని చుట్టుపక్కల ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లే అవసరం లేకుండా ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఈ సౌకర్యం పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.