gwmc కార్యాలయ ఆవరణలో నగర అభివృద్ధికి 100 రోజుల ప్రణాళిక కార్యక్రమం ప్రారంభించిన mla నాయిని రాజేందర్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రోజు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయంలో నగర అభివృద్ధి ఏర్పాటు చేసిన 100 రోజుల ప్రణాళిక కార్యక్రమాన్ని నగర్ మేయర్ శ్రీమతి గుండు సుధారాణి,కమీషనర్ శ్రీమతి అశ్విని తానాజీ వాకాడే గార్లతో కలిసి సోమవారం ఉదయం 9గంటలకు కార్యక్రమాన్ని ప్రారంభించారు. శాసన మండలి సభ్యులు శ్రీ బస్వరాజు సారయ్య కుడా చైర్మన్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా నగర అభివృద్ధిలో అధికారులు భాగస్వామ్యం అవుతామని వారితో ప్రతిజ్ఞ చేయించారు.