ధర్మపురి: పట్టణంలోని నరసింహుడి ఆలయంలో ఆర్మీ విజయోత్సవ పూజలు
జగిత్యాల జిల్లా ధర్మపురిలో దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు శ్రీలక్ష్మి నరసింహుడి ఆలయంలో శుక్రవారం ఆర్మీ విజయోత్సవ పూజలు నిర్వహించారు. భారతదేశ బార్డర్లో విధులు నిర్వహిస్తున్న జవాన్లు శక్తివంతులుగా ధైర్యవంతులై విజయం సాధించే దిశగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామి అనుగ్రహం వారికి కలగాలని అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాస్, ఛైర్మన్ రవీందర్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.