నంద్యాల జిల్లా బండిఆత్మకూరు మండలంలోని ఎ.కోడూరు గ్రామానికి చెందిన దేరెడ్డి అశోక్ కుమార్ రెడ్డి (38) అప్పుల బాధతో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై జగన్మోహన్ తెలిపారు. 20 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని సాగు చేయగా, పంట నష్టపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారు. దీంతో ఖాదర్వ స్వామి దర్గా సమీపంలో పురుగుల మందు తాగి మృతి చెందారు. మృతుడి తల్లి రామేశ్వరమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.