ధర్మారం: ధర్మారంలో వర్షానికి తడిసిన వరి ధాన్యాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో అకాల వర్షంతో తడిసిన వరి ధాన్యాన్ని శనివారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు ఆందోళన చెందవద్దని, చివరి గింజ వరకు వరి ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు