ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో విద్యుత్ వైర్లు ఏర్పాటు చేస్తూ ఉండడంతో మధ్యాహ్నం రెండు గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగినట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలకు ముందుగానే తెలియజేశామన్నారు. రోడ్డు క్రాసింగ్ చేసే వాహనాలకు మరియు రథోత్సవం సందర్భంగా రథానికి విద్యుత్ వైర్లు అడ్డుగా ఉండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో విద్యుత్ శాఖ అధికారులు అలాంటి ఇబ్బందులు లేకుండా వైర్లను తొలగించినట్లు తెలిపారు.