రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన షాద్నగర్ పట్టణ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. షాద్నగర్ శివారులోని కొత్తపేట రహదారిలో ద్విచక్రవాహనం కారును ఓవర్ టేక్ చేసే సమయంలో డీసీఎం టైర్ల కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.