ధర్మపురి: కోటిలింగాల పార్వతీ శ్రీ కోటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్
వెల్గటూర్ మండలం కోటిలింగాల పార్వతీ శ్రీ కోటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో శుక్రవారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించి స్వామి వారి కళ్యాణాన్ని వీక్షించారు. అనంతరం ఆలయ అర్చకులు అధికారుల శాలువాతో సన్మానించి స్వామి వారి తీర్థ ప్రసాదాలను వారికి అందజేసారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.