నాగర్ కర్నూల్: తాడూరు మండల పరిధిలోనియంగంపల్లి గేటు వద్ద గేదె కళేబరాన్ని తగిలి కిందపడిన యువకుడు కోమాలోకి వెళ్ళిన వైనం
రోడ్డుపై మృతి చెందిన గేదె కళేబరానికి తగిలి ద్విచక్ర వాహనదారుడు ప్రమాదవశాత్తు కింద పడి కోమాలోకి వెళ్లిన తాడూరు సంఘటన మండల పరిధిలోని వెంగంపల్లి గేటు సమీపంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే బిజినేపల్లి మండలం గుడ్ల నర్వ గ్రామానికి చెందిన యువకుడు సోమవారం ఉదయం దాదాపు ఐదు గంటల ప్రాంతంలో 167కి హైవేపై నాగర్ కర్నూల్ నుండి కల్వకుర్తి వైపు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా రోడ్డుపై పడి ఉన్న గేదె కళేబరం ను గమనించక వేగంగా ఢీ కొట్టి ఎగిరి కింద పడిపోవడంతో తీవ్ర గాయాలైనా అని యంగంపల్లి గ్రామస్తులు తెలిపారు.