రాంబిల్లి మండలం వెంకటాపురంలో రామాలయం ప్రారంభం
రాంబిల్లి మండలం వెంకటాపురం గ్రామంలో కొత్తగా నిర్మించిన రామాలయాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ మేరకు ఆలయంలో విష్వక్సేన పూజ పుణ్యాహవాచనం నిర్వహించారు. గ్రామస్తులు పలువురు ఆలయానికి తరలి వచ్చి సీతారామచంద్ర స్వామిని దర్శించుకుని పూజలు చేసారు. ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు ఎలమంచిలి నియోజకవర్గం టిడిపి ఇన్చార్జి ప్రగడ నాగేశ్వరరావు, పార్టీ ప్రధాన కార్యదర్శి రంగనాయకులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.