నగరి: పుత్తూరు జెండామాను వీధిలో పిచ్చికుక్క స్వైర విహారం
పుత్తూరు జెండామాను వీధిలో ఆదివారం పిచ్చికుక్క స్వైర విహారం చేస్తూ దొరికిన వాళ్లను దొరికినట్లుగా కరిసింది. ముగ్గురిని కరవగా వారు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లడానికి కూడా భయపడే పరిస్థితి నెలకొంది. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కొరుతున్నారు.