డిసెంబర్ 29వ తేదీ సోమవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మీడియాకు ప్రకటన విడుదల చేసిన కలెక్టర్ మీకోసం కార్యక్రమంలో అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొంటారని ప్రజలు తమ సమస్యలపై అర్జీలు ఇవ్వవచ్చని తెలిపారు.