కొత్తకోట: నియోజకవర్గంలో సాగునీరందక ఎండిపోయిన వరి పంట...
దేవరకద్ర నియోజకవర్గం లోని పలు గ్రామాలలో సాగునీరు అందక, భూగర్భ జలాలు అడుగంటి బోర్లు నడవక వరి పంట పూర్తిగా ఎండిపోయింది. చేతికొచ్చిన పంట నీరు లేక ఎండిపోవడంతో రైతన్నలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అప్పు తెచ్చి పంట వేస్తే చేతికొచ్చిన పంట సాగునీరు అందక ఎండిపోవడం తీవ్రంగా కలచివేస్తుందని రైతులు వాపోతున్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని నియోజకవర్గానికి చెందిన పలువురు రైతులు శనివారం సాయంత్రం 6 గంటలకు ఒక ప్రకటనలో కోరారు.