పాములపాడు మండలం ఎర్రగుడురు గ్రామంలో కుల, మతాలకు అతీతంగా మౌలాలి స్వామి సరిగేసు ఘనంగా నిర్వహించారు, గ్రామంలోని యువకులు మరియు మహిళలు పెద్ద ఎత్తున ఈ స్వామి వారి సరిగేసు లో పాల్గొన్నారు, వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తప్పెట్లు తీసుకువచ్చి గ్రామంలో ఘనంగా స్వామివారిని ఊరేగింపు చేశారు,స్వామివారు ఇంటి వద్దకు రాగానే మహిళలు భక్తితో స్వామివారికి కాయ, చక్కెర సమర్పించారు, మరికొందరు తమ కోరికలు నెరవేరినందుకు స్వామివారికి పూల దట్టీలు, సూచికము తప్పెట్లతో ఊరేగింపుగా తీసుకువెళ్లి స్వామివారికి సమర్పించారు,