శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాల ఘనంగా ముగిశాయి,చివరిరోజు భ్రమరాంబా సమేతుడైన మల్లికార్జునస్వామి అశ్వవాహనాదీశులై భక్తులకు దర్శనమిచ్చారు,ఆలయంలో ఉదయం నుంచి అర్చకులు,వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామివారి ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో అశ్వ వాహనంలో ఆవహింపజేసి,అర్చకస్వాములు వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులిచ్చారు అనంతరం శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను విద్యుత్ దీప కాంతుల నడుమ, ఆలయ ప్రదక్షిణలు గావించారు ఈ పూజ కైకర్యాలలో దేవస్థానం ఈవో శ్రీనివాసరావు దంపతులు, ట్రస్ట్ బోర్డు మెంబర్లు ,అధికారులు,భక్తులు పాల్గొన్నారు,