అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని క్రైస్తవ ప్రార్థన మందిరాల్లో క్రిస్మస్ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ప్రత్యేక ప్రార్థనల కోసం వచ్చిన క్రైస్తవులతో పలు చర్చిలు కిక్కిరిసిపోయాయాయి. క్రిస్మస్ పండుగ ప్రత్యేకతలు వినిపిస్తూ ఏర్పాటు చేసిన పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. చిన్నారులు, మహిళలు ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. రాయదుర్గం పట్టణంలోని మొలకల్మూరు రోడ్డులో ఉన్న మిస్సయ్యా మిరాకిల్ చర్చిలో జరిగిన వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలవశ్రీనివాసులు పాల్గొన్నారు. పాస్టర్లు, చర్చి నిర్వాహకులతో కలసి కేక్ కట్ చేశారు.