పాణ్యం: శాంతిరామ్ ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంపు రెండో రోజు కార్యక్రమాలు నిర్వహించిన విద్యార్థులు
శాంతిరామ్ ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో వడ్డుగండ్ల గ్రామంలో రెండో రోజు ప్రత్యేక శిబిరం నిర్వహించారు. వ్యర్థాలను తడి–పొడి చెత్తగా వేరు చేయడం, పరిశుభ్రతపై గ్రామస్తులకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. పర్యావరణ కాలుష్యం తగ్గించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ప్రిన్సిపాల్ డా. ఎం.వి. సుబ్రహ్మణ్యం తెలిపారు. ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ నాగరాజు, ఇంచార్జ్ శ్రీహరి, నీటి సంఘం అధ్యక్షుడు మోహన్ కుమార్, వాలంటీర్లు పాల్గొన్నారు.