మణుగూరు: గుండాలలో కన్నుల పండుగగా నాయక పోడు రాయి పాపయ్య జాతర
గుండాల మండల కేంద్రంలో నాయకపోడు కులదైవం శ్రీ రాయి పాపయ్య,అనమాల కన్నయ్య జాతర బుధవారం మద్యాహ్నం ప్రారంభమైంది. నేటి నుంచి మూడు రోజులపాటు జరిగే ఈ జాతరలో భాగంగా నాయక పోడు ఆదివాసీలు లక్ష్మీదేవర ఆట పాటలు, వారి సంస్కృతీ సాంప్రదాయాలతో , డోలి చప్పుళ్లతో, ఆదివాసి నృత్యాలతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గుండాల మండలం నాయకపోడు ఆదివాసీలు పాల్గొన్నారు. .