వీ.కోట: ముదిమడుగు గ్రామ స్థానికులు మీడియా తెలిపిన సమాచారం మేరకు. అను శ్రీ అనే విద్యార్థిని తన ఇంటిలోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుని మృతి చెందిందన్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.అనుశ్రీ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు పోలీసులు. మృతురాలి గదిలో ఐ యాం సారీ నాన్న, ఐ లవ్ యు, ఐ మిస్ యు, హ్యాపీ బర్త్డే పునీత్, బీ హ్యాపీ అనే స్లిప్పులు గోడకు అంటించి ఉన్నాయి. ఈ ఘటనతో వారి కుటుంబీకం తీవ్ర శోక సంద్రంలో మునిగిపోయింది. గ్రామంలో విషాద ఛాయాలు అలుముకున్నాయి.