తిరుమలగిరి సాగర్: మూలతండ సమీపంలోని అటవీ ప్రాంతంలో చెలరేగిన కార్చిచ్చు, 70 ఎకరాల్లో వ్యాపించిన మంటలు
నల్గొండ జిల్లా, తిరుమలగిరి సాగర్ మండలం, మూలతండా సమీపంలోని అటవీ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం కార్చిచ్చు అంటుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. 70 ఎకరాలలో మంటలు వ్యాపించి అడవి తగలబడుతుందని, అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.