ధర్మారం: పట్టణంలోని నరసింహస్వామి ఆలయంలో మంత్రి రాజనర్సింహ, ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ పూజలు
ధర్మపురి పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నరసింహ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మంత్రిని, ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు