ఘన్పూర్ స్టేషన్: స్టేషన్ ఘన్ పూర్ : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో స్టేషన్ ఘన్పూర్ విద్యార్థి మృతి
స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రంలో ని శివునిపల్లి గ్రామానికి చెందిన పార్శి గౌతమ్ కుమార్ 20 ఏళ్ల బీటెక్ విద్యార్థి ఇండియన్ కాలమాల ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. స్టేషన్గన్పూర్ మండల కేంద్రంలోని శివునిపల్లి గ్రామానికి చెందిన పార్సి కమల్ కుమార్ -పద్మ దంపతుల కుమారుడు గౌతమ్ అమెరికాలోని హరిజోనా రాష్ట్రంలోని హరిజోనా విశ్వవిద్యాలయంలో 2వ సంవత్సరం ఇంజనీరింగ్ చదువుతున్నట్లు తెలిపారు. కళాశాల నుండి రూమ్ కు గౌతంతో పాటు స్నేహితుడు నివేష్ తో కలిసి ఇరువురు కారులో వెళుతుండగా ఈ ఘటన జరిగినట్లు తెలిపారు.