ఆలూరు: దేవనకొండ మండలంలో సరైన బస్సులు లేక, పరిమితికి మించి విద్యార్థులని ఎక్కించుకొని, ఆటో డ్రైవర్ల ఇష్టారాజ్యం
Alur, Kurnool | Dec 3, 2025 దేవనకొండ మండలం పల్లెదొడ్డి, గద్దెరాళ్ల, వెంకటాపురం తదితర గ్రామాలకు చెందిన విద్యార్థులు సరైన బస్సు సౌకర్యం లేక ప్రతిరోజూ ప్రమాదకరంగా ఆటోల్లో ప్రయాణిస్తున్నారు. సామర్థ్యానికి మించి విద్యార్థులను ఎక్కించుకోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తక్షణమే బస్సు సౌకర్యం కల్పించాలని వారు కోరుతున్నారు.