కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గురువారం రాయదుర్గం పట్టణంలో కార్మిక సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. కార్మికులను బానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసి పాత చట్టాలను పునరుద్ధరించాలని, కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని ట్రేడ్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. వినాయక కూడలి నుంచి ప్రారంభమైన ప్రదర్శన తహశీల్దార్ కార్యాలయం వరకు కొనసాగింది. సిఐటియు జిల్లా నాయకులు నాగభూషణ, రైతుసంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, సిపిఐ సంజీవప్ప, నాగార్జున, సిపిఎం నాయకులు మల్లికార్జున, అంగన్వాడీ యూనియన్ నాయకులు పాల్గొన్నారు.