ఘన్పూర్ స్టేషన్: స్టేషన్ ఘన్ పూర్ : దాసన్న గూడెం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడి పదవి విరమణ
రఘునాథపల్లి మండలం దాసన్న గూడెం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న లోకుంట్ల శంకరయ్య అనే ఉపాధ్యాయుడు సోమవారం సాయంత్రం 4 గంటలకు పదవి విరమణ కార్యక్రమం నిర్వహించారు. మే నెలలో శంకరయ్య పదవి విరమణ జరగనుండగా ముందస్తుగా సోమవారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. మండల నోడల్ అధికారి రఘునందన్ రెడ్డి మాట్లాడుతూ నిత్యఅన్వేషకుడు ఉపాధ్యాయుడన్నారు. ఉపాధ్యాయుడు నిరంతరం పుస్తక పఠనతో పాటు ప్రపంచంలో జరిగే ప్రతి విషయాన్ని అన్వేషిస్తూ విద్యార్థులకు వివరిస్తూ వారిని తీర్చిదిద్దడంలో నిరంతర శ్రామికుడిగా పనిచేసే వారే ఉపాధ్యాయుడని అన్నారు.