వికారాబాద్: AKR స్టడీ సర్కిల్ లో వికారాబాద్ లో ఈనెల 11న అసిస్టెంట్ బయోసైన్స్ పైన ఉచిత అవగాహన సదస్సు
జూన్ చివరి వారంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టబోయే డీఎస్సీ పోటీ పరీక్షలకు గాను ఈనెల 11వ తేదీ సోమవారం రోజున ఏ కె ఆర్ స్టడీ సర్కిల్లో ఎస్జీటీ మరియు స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ వారికి ఉచిత అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు ఏకేఆర్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ బివి రమణ తెలిపారు. ఈ అవగాహన సదస్సుకు పోటీ పరీక్షల నిపుణులు హాజరై తమ సలహాలను సూచనలను ఇస్తారని ఈ అవకాశాన్ని వికారాబాద్ జిల్లా లో బిఎడ్ పూర్తి చేసిన మరియు డీఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులు ఉపయోగించుకోవాలని తెలిపారు.