కొండపి: ఎమర్జెన్సీ ల్యాండింగ్ మాకొద్దు అంటూ సింగరాయకొండ మండలానికి చెందిన రైతులు ఒంగోలు కలెక్టర్ క్యాంపు కార్యాలయం వద్ద నిరసన
ప్రకాశం జిల్లా సింగరాయకొండ జాతీయ రహదారిపై సుమారు 3.6 కి.మీల మేర ఇటీవల ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఎమర్జెన్సీ లాండింగ్ నిలిపివేయాలని పరిసర గ్రామాల రైతులు నిరసనలు చేపడుతున్నారు. తాజాగా ఈ నిరసన సెగ ఒంగోలు కలెక్టరేట్‌కు చేరింది. సింగరాయకొండ చుట్టుపక్కల గ్రామ రైతులు సోమవారం ఒంగోలు కలెక్టరేట్ వద్దకు భారీగా చేరుకొని నిరసన చేపట్టారు. ఇది రైతుల జీవనాధారాన్ని దెబ్బతీసే నిర్ణయమని, ప్రభుత్వం పునఃరాలోచన చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు.