పాణ్యం: ఓర్వకల్లు లిమిట్స్‌లో బస్సును ఢీకొట్టిన కారు స్వల్ప గాయాలతో బయటపడిన ప్రయాణికులు
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు లిమిట్స్‌లో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. నంద్యాల నుండి కర్నూలు వైపు వెళ్తున్న బస్సును ఒక కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్పగాయాలు అయ్యాయి. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే హైవే పోలీసులకు సమాచారం అందించారు.