రాయదుర్గం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆసుపత్రి అభివృద్ధి సలహా మండలి సభ్యులు సంపత్ కుమారి, కొండాపురం శ్రీనివాసులు, కళ్యాణ్ చక్రవర్తి అన్నారు. ఆదివారం వారు మాట్లాడుతూ HDC సమావేశంలో MLA దృష్టికి తీసుకెళ్లగా దాతల సహకారం కోరగా సర్కిల్ వినాయక అసోసియేషన్, హిందూ సమ్మేళన సమితి వారు ఆసుపత్రిలో RO ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చారన్నారు. త్వరలో ఏర్పాటు పూర్తి చేసి రోగులకు అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు.