అనంతపురం జిల్లా ఉరవకొండ మండల పరిధిలోని రాకెట్ల గ్రామంలో బుధవారం జరిగిన గ్రామ జాతరకు వెళ్లి బెళుగుప్పకు తిరుగు ప్రయాణమైన ఆటో వాహనం రాకెట్ల గ్రామ సమీపంలో రహదారి పక్కన ఉన్న చెట్టును ఢీకొంది. మధ్యాహ్నం 3.40 గంటలకు జరిగిన ప్రమాదంలో బెలుగుప్పకు చెందిన ఆటో డ్రైవర్ హరి తీవ్ర గాయాల పాలు కాగా మరొకరు మృత్యుంజయ, మరికొందరికి స్వల్ప రక్త గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు.