ఆలూరు: ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా దేవనకొండ పీహెచ్సీ వైద్యాధికారి విజయ భాస్కర ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ
Alur, Kurnool | Dec 1, 2025 ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా దేవనకొండ పీహెచ్సీ వైద్యాధికారి విజయ భాస్కర్, హెవ్వో భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో సోమవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆరోగ్య సిబ్బంది, ఆశా వర్కర్లు, విద్యార్థులు పాల్గొన్న ఈ ర్యాలీ ద్వారా ఎయిడ్స్‌పై అపోహలు తొలగించారు. సురక్షిత జీవనశైలి పాటించడం, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ముఖ్యమని ప్రజల్లో చైతన్యం కల్పించారు.