హిమాయత్ నగర్: కృష్ణానగర్ లో పర్యటించి స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
జూబ్లీహిల్స్ లోని కృష్ణ నగర్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం మధ్యాహ్నం అధికారులతో కలిసి పర్యటించారు. అనంతరం ఆయన స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్థానికులు వరద నీరు డ్రైనేజీ పొంగి పొల్లడం మురుగునీరు రోడ్లపై ఉందని కిషన్ రెడ్డికి తెలిపారు. స్పందించిన ఆయన అధికారులతో మాట్లాడి సమస్యలకు పరిష్కారం చూపాలని ఆదేశించారు. ప్రజా సమస్యల శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని అన్నారు. ఎటువంటి సమస్యలున్న తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొన్నారు.