గుంతకల్లు: పామిడి సమీపంలోని 44 నెంబర్ జాతీయ రహదారిపై అర్ధరాత్రి తర్వాత ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది ఒకరు మృతి మరొకరికి గాయాలు
పామిడి సమీపంలోని 44 నెంబర్ జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి తర్వాత ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది ప్రమాదంలో కల్లూరుకు చెందిన చంద్రశేఖర్ అక్కడికక్కడే మృతి చెందగా రంగ అనే మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న ట్రాక్టర్ను పక్కకు తొలగించి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పామిడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం అనంతపురం ఆసుపత్రికి తరలించారు ఈ సంఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.