భూపాలపల్లి: కెటికె 5వ గనిలో విష వాయువులు వెలువడిన ఘటనలో ఆరుగురు కార్మికులు సురక్షితం : సింగరేణి జిఎం రాజేశ్వర్ రెడ్డి
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి కేటీకి 5వ బొగ్గుగనిలో కార్మికులు వెల్డింగ్ చేస్తున్న క్రమంలో నిప్పు రవ్వలు బొగ్గు పై పడటంతో విషవాయులు చెలరేగి 6 కార్మికులు అస్వస్థకు గురయ్యారని వెంటనే ర్స్క్యూ సిబ్బంది మరియు ఫైర్ సిబ్బంది చేరుకుని ఆరుగురు కార్మికులను గని నుంచి బయటకు తీసుకొచ్చి సురక్షితంగా సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఎలాంటి ప్రాణాపాయం లేదని విషవాయులు వెలువడిన నేపథ్యంలో ఈ సంఘటన చోటుచేసుకుందని పూర్తి వివరాలు విచారణ జరిపిన అనంతరం తెలియజేస్తామని గురువారం సాయంత్రం ఐదు గంటలకు తెలిపారు జిఎం రాజేశ్వర్ రెడ్డి.