యర్రగొండపాలెం: నల్లగుంట్ల లో వెంకటేశ్వర్ల హత్యకు గల కారణాలను వెల్లడించిన డి.ఎస్.పి నాగరాజు
ప్రకాశం జిల్లా దోర్నాల మండలం నల్లకుంట్ల గ్రామంలో శుక్రవారం రాత్రి పీర్ల పండగ ఉత్సవాలలో వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని నరికి హత్య చేసిన విషయం తెలిసినదే. ఈ హత్యకు గల కారణాలను మార్కాపురం డిఎస్పి నాగరాజు తెలియజేశారు. గతంలో నల్లకుంట్ల సర్పంచ్ భర్త హత్య కేసులో వెంకటేశ్వర్లు ప్రధాన నిందితుడిగా ఉన్నారన్నారు. దీంతో ప్రత్యర్థి వర్గము పరస్పర రాజకీయ వేదాలతో హత్య చేసి ఉండవచ్చని పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.