విశాఖపట్నం: VMRDA కి చెందిన అన్ని రకాల కళ్యాణ మండపం ఆన్లైన్ లో బుకింగ్ సేవలు అందుబాటులో తీసుకొచ్చామని తెలిపిన చైర్మన్ ప్రణవ్ గోపాల్
విశాఖపట్నం పిఎమ్ఆర్డిఏ కి చెందిన అన్ని రకాల కళ్యాణమండపాలు బుకింగ్ విధానం అంతా పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశ్యం తో ఆన్లైన్ బుకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చామని VMRDA చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్ అన్నారు. బుధవారం ఉదయం వి ఎం ఆర్ డి ఎ బాలల థియేటర్ లో ఆన్లైన్ బుకింగ్ విధానాన్ని ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ వి ఎం ఆర్ డి ఎ కి చెందిన అన్ని ఫంక్షన్ హాళ్లు ఆన్లైన్ లో ఉంచుతున్నామని, ప్రజలకు అవసరమైన తేదీల్లో ఆన్లైన్ లో చూసుకొని బుక్ చేసుకునే సదుపాయం కల్పించమని చెప్పారు. ఈ కార్యక్రమంలో వి ఎం ఆర్ డి ఎ కార్యదర్శి మురళీ కృష్ణ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.