దుబ్బాక: దుబ్బాక పట్టణంలో కురిసిన అకాల వర్షం, తడిసిన వరిధాన్యం
సిద్దిపేట జిల్లా దుబ్బాక లో శుక్రవారం వర్షం కురిసింది. సుమారు అరగంట పాటు కురిసిన వర్షానికి మండలంలోని పలు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన వరిధాన్యం తడిసి ముద్దయింది. అదేవిధంగా దుబ్బాక పట్టణంలోని మార్కెట్ యార్డులో ఆరబెట్టిన ధాన్యం వర్షానికి కొట్టుకపోయింది. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం వర్షానికి కొట్టుకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.